హాలీవుడ్ ని తలదన్నేలా ప్రభాస్ సాహో టీజర్

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించే హై టెక్నికల్ వాల్యూస్‌‌తో హై వోల్టేజ్ క్రియేట్ చేస్తూ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ టీజర్ విడుదలైంది. ముందుగా ప్రకటింనట్టుగా గురువారం నాడు సరిగ్గా 11.23 గంటలకు టీజర్‌ను విడుదల చేశారు. ‘బాహుబలి 2’ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్స్‌లతో హైప్ తీసుకువచ్చేదిగా ఈ టీజర్‌ను రూపొందించారు. 1.38 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని భారీ యాక్షన్ సీన్స్‌తో రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ అదరగొడుతున్నారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ ఎపిసోడ్‌‌లో భాగమైనట్లు ఈ టీజర్‌లో కనిపిస్తోంది. సుజిత్ డైరెక్షన్‌కి ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ కెన్నీ బటీస్ అద్భుత యాక్షన్ సన్నివేశాలు తోడు కావడంతో ‘సాహో’ హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. ప్రభాస్ ఇమేజ్‌ను తగ్గట్లుగా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని సుమారు రూ. 250 కోట్లతో యూవీ క్రియేషన్స్‌లో వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు.