మెగా అల్లుడు ఈసారి పవన్‌ పాట

sai dharam tej Coming Soon Remix Of Pawan Songs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయే సక్సెస్‌ అయ్యాయి. ముఖ్యంగా 80 మరియు 90 లలో చిరంజీవి పాటలు అప్పటి యూత్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన విషయం తెల్సిందే. ఇప్పటికి కూడా చిరంజీవి పాటలు ఆడియన్స్‌తో జేజేలు కొట్టించుకుంటూనే ఉన్నాయి. అంతటి సక్సెస్‌ పాటలను మెగా ఫ్యామిలీ హీరోలు రీమిక్స్‌ చేసి లాభం పొందుతున్నారు. ఇప్పటికే చరణ్‌ తన తండ్రి కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అయిన రెండు పాటలను రీమిక్స్‌ చేయగా, సాయి ధరమ్‌ తేజ్‌ మూడు పాటలను తన సినిమాలకు వాడేశాడు. తాజాగా నటించిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంలో మరోసారి మామ పాటను తేజూ రీమిక్స్‌ చేయడం, ఆ పాటకు మంచి స్పందన రావడం జరిగింది.

ఈ సమయంలోనే సాయి ధరమ్‌ తేజ్‌ రీమిక్స్‌ పాటలపై స్పందిస్తూ మామయ్య చిరంజీవి పాటలను రీమిక్స్‌ చేసినప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఆ స్థాయిలో పాటను తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కష్టపడతామని చెప్పుకొచ్చాడు. చినమామ పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలోని ఒక పాటను కూడా రీమిక్స్‌ చేయాలని చాలా కాలంగా కోరికగా ఉన్నాను అని, అయితే దర్శకులు వారి ఇష్టం మేరకు పాటల రీమిక్స్‌ చేస్తున్నారు. నా కోరికను నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పవన్‌ ఏ పాటను రీమిక్స్‌ చేయాలనే కోరిక ఉంది అనే విషయంలో మాత్రం తేజూ క్లారిటీ ఇవ్వలేదు. పవన్‌ పాటను తేజూ రీమిక్స్‌ చేస్తే మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ పండగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.