బాబోయ్‌.. సమంతను చూస్తుంటే భయమేస్తోంది

Samantha as Ramalakshmi Rangasthalam Teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్‌, సమంతలు మొదటి సారి కలిసి నటించడంతో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం పూర్తిగా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడం మరియు చరణ్‌, సమంతల లుక్స్‌ చాలా విభిన్నంగా ఉండటం వంటి కారణాల వల్ల సినిమాపై ఆసక్తి తారా స్థాయిలో ఉంది. ఇటీవలే చరణ్‌ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సమంత టీజర్‌ విడుదలై సినిమాపై మరింత అంచనాలు పెంచుతుంది. 

‘రంగస్థలం’ చిత్రంలో సమంత లుక్‌పై మొదటి నుండి కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌లు ఇస్తూ వచ్చారు. సమంత పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుందని, పక్కా మాస్‌లుక్‌లో ఉంటుందని, మూగ అమ్మాయి అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా అధికారికంగా సమంత లుక్‌ రివీల్‌ చేశారు. డీ గ్లామర్‌గా, పాత తరం పల్లెటూరు అమ్మాయిగా, లంగా ఓణీలో సైకిల్‌ తొక్కుతూ కనిపించిన సమంతను చూసి ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. హీరోయిన్స్‌ అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేయాలి, చేస్తేనే వారిలో ప్రతిభ వెలుపలకు వస్తుంది. అందుకే సమంత ఈ పాత్రకు కమిట్‌ అయ్యి ఉంటుంది. కాని సమంతను చూస్తున్న ఫ్యాన్స్‌కు మరియు ప్రేక్షకులకు మాత్రం కాస్త టెన్షన్‌గా ఉందట. మరీ ఇంత మార్పును సమంత నుండి ప్రేక్షకులు ఎలా రీసీవ్‌ చేసుకుంటారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సమంత ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. మరి సమంత కష్టంకు ప్రతిఫలం దక్కేనా లేదా అనేది సినిమా విడుదల తర్వాత తేలిపోనుంది.