రంగ‌స్థ‌లంలో రామ‌ల‌క్ష్మిగా స‌మంత‌

Samantha Introducing as Rama Lakshmi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అచ్చ‌మైన ప‌ల్లెప‌డుచుగా లంగావోణీ క‌ట్టుక‌ని, గోదావ‌రి నీళ్ల‌లో న‌డుస్తూ, చెరుకుక‌ట్ట నెత్తిన పెట్టుకుని న‌వ్వుతూ,తుళ్లుతూ ముందుకు సాగిపోతూ స‌మంత అంద‌రినీ త‌న‌వైపుకు తిప్పుకుంది. రామ్ చ‌ర‌ణ్, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న రంగ‌స్థ‌లం సినిమాలో స‌మంత పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. స‌మంత న‌డిచివెళ్తుండ‌గా…బ్యాక్ గ్రౌండ్ లో రామ్ చ‌ర‌ణ్ ఓహోహో ఏం వయ్యారం…ఏం వ‌య్యారం..ఏమాట‌కామాట సెప్పుకోవాలిగానండీ…

ఈ పిల్ల ఎదురొస్తంటే మా ఊరికే 18 సంవ‌త్స‌రాల వ‌య‌సొచ్చిన‌ట్టుంట‌దండీ…ఈ చిట్టిగాడి గుండెని గోలెట్టిచ్చేసింది ఈ పిల్లేనండి…పేరు రామ‌ల‌క్ష్మండి. ఊరు…అంటుండ‌గా..రంగా..రంగా…రంగ‌స్థ‌లానా అంటూ వ‌చ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. రంగ‌స్థ‌లం షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. చివ‌రి షెడ్యూల్ లో పూజా హెగ్డేపై స్పెషల్ సాంగ్ చిత్రీక‌రించారు. మార్చి 30వ తేదీన సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి.