ఎట్టకేలకు మొదలైన ‘చిత్రలహరి’…!

Sai Dharam Tej Next Movie Title Chitralahari

ఈమద్య కాలంలో వరుసగా ఫ్లాప్‌లను చవిచూసిన సాయి ధరమ్‌ తేజ్‌ కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. తేజూ గత చిత్రం ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ ఫ్లాప్‌ నేపథ్యంలో కాస్త ఆలోచనల్లో పడ్డాడు. చాలా సినిమాల విషయంలో వరుణ్‌ తేజ్‌ ఆచితూచి అడుగు వేయలేదని భావిస్తున్నాడు. అందుకే తన తదుపరి చిత్రం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాడు. అందుకే తదుపరి చిత్రంకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. తాజాగా తేజ్‌ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.

chitrala-hari

వరుస సక్సెస్‌లను దక్కించుకున్న కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈయన సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనుకున్నట్లుగానే, ప్రచారం జరిగినట్లుగానే కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తేజూ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘హలో’ చిత్రం హీరోయిన్‌ కళ్యాణి ప్రదర్శిణి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈమద్య కాలంలో సూపర్‌ హిట్స్‌ను అందుకున్న మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ ముఖ్య అతిథిగా ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. వచ్చే వేసవికి సినిమాను విడుదల చేసేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

sai-dharam-tej