కాస్త నెమ్మది బాబు..!

Sai Dharam Tej to act in Gopichand Malineni Direction
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వరుస చిత్రాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పర్చుతున్నాడు. ‘విన్నర్‌’, ‘జవాన్‌’, ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చి, బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్‌లను చవి చూశాడు. అయినా కూడా తేజూ స్పీడ్‌ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న తేజూ తాజాగా తనకు విన్నర్‌ చిత్రంతో చేదు ఫలితాన్ని మిగిల్చిన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. త్వరలోనే ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఆ చిత్రంతో పాటు మరో సినిమాను కూడా చేసేందుకు తేజూ సిద్దం అయ్యాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు తేజూ ఆసక్తిగా ఉన్నాడు. ఈ దర్శకుడు అనుకోకుండా ఒక రోజు, సాహసం, మనమంతా చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈయన మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్దం అవుతున్నాడు. ఆ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించబోతున్నాడు అంటూ ప్రముఖ నిర్మాత అనధికారికంగా వెళ్లడి చేశాడు. వచ్చే సంవత్సరంలో ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి సాయి ధరమ్‌ తేజ్‌ స్పీడ్‌కు ఇతర మెగా హీరోలు కూడా అవాక్కవుతున్నారు. ఇక సినీ విశ్లేషకులు మాత్రం తేజూ స్పీడ్‌ తగ్గించుకుంటే మంచిదని, ఈ కాలంలో సినిమాల సంఖ్య కంటే సక్సెస్‌ల సంఖ్య కెరీర్‌ను నిలుపుతుందని సలహా ఇస్తున్నారు.