మెగా అల్లుళ్ల ఫైట్‌ తప్పదా?

Sai Dharam Tej Vs Kalyan Dev Movies Release in July

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ‘విజేత’ చిత్రంతో పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించాడు. గతంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఈగ’ చిత్రం విడుదల అయిన తేదీకే ‘విజేత’ను విడుదల చేసేందుకు ఫిక్స్‌ అయ్యారు. జులై 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇటీవలే విడుదలైన టీజర్‌ అందరిని ఇంప్రెస్‌ చేసింది. ఇక సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈనెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆడియో విడుదల కార్యక్రమంను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా చకచక జరుగుతున్న సమయంలో ఈ చిత్రానికి మరో మెగా మూవీతో పోటీ తప్పేలా లేదని ప్రచారం జరుగుతుంది.

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. జూన్‌లోనే ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వస్తున్నాయి. మొన్నటికి మొన్న జులై 6న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని ఆ తేదీకి కూడా సినిమాను విడుదల చేయడం కష్టమే అని తేలిపోయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై మూడవ వారంలోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ‘విజేత’ చిత్రాన్ని జులై 20న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తేజ్‌ కూడా అదే సమయంలో విడుదల అయితే ఇబ్బంది తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం రెండు కూడా చిన్న సినిమాలే కనుక పెద్ద ఇబ్బంది ఉండదనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి చిరంజీవి అల్లుళ్ల మద్య ఫైట్‌ తప్పేలా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కల్పించుకుంటే తప్ప ఈ క్లాష్‌ తప్పదని కూడా అంటున్నారు.