సాయి పల్లవి మరీ ఇంత కమర్షియలా?

Sai Pallavi Exclusive Interview

మలయాళ సినీ పరిశ్రమ నుండి తెలుగు పరిశ్రమకు ‘ఫిదా’ చిత్రంతో ఇంపోర్ట్‌ అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పడిపడి లేచే మనసు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేస్తున్నారట. కొన్ని సీన్స్‌ను చిత్రీకరణ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తి, ఆ సీన్స్‌ సరిగా రాలేదని, అందుకే ఆ సీన్స్‌ను మళ్లీ ప్లాన్‌ చేస్తున్నారట. ఆ సీన్స్‌ చిత్రీకరణకు ఏర్పాట్లు చేసిన దర్శకుడు హను కు సాయి పల్లవి షాక్‌ ఇచ్చిందట.

తాను ఇచ్చిన డేట్లు పూర్తి అయినందున మళ్లీ డేట్లు ఇవ్వాలి అంటే అదనపు పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేసిందట. రెండు వారాల డేట్ల కోసం సాయి పల్లవి భారీగా వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. సహజంగా చిత్రాల రీ షూట్‌కు హీరోయిన్స్‌ కాని, హీరోలు కాని పారితోషికాలు తీసుకోరు. కాని సాయి పల్లవి మాత్రం షాకింగ్‌గా రీ షూట్‌కు హాజరు అవ్వాలి అంటే పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ కండీషన్‌ పెట్టిందట. దాంతో తప్పని పరిస్థితుల్లో తప్పక ఆమెకు రీ షూట్‌ కోసం పారితోషికం ఇవ్వాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు రహస్యంగా ఉంచాలని ప్రయత్నించినా ఆనోటా ఈనోటా పడి వైరల్‌ అయ్యింది. సాయి పల్లవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాయి పల్లవి మరీ ఇంత కమర్షియల్‌ లా అంటూ కామెంట్స్‌ విసురుతున్నారు.