ఓటమి పాలైన సైనా

ఓటమి పాలైన సైనా

చైనా ఓపెన్‌లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైంది. 24 నిమిషాల పాటు సాగిన చైనా ఓపెన్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి చైనా ప్లేయర్‌ కై యాన్‌ యాన్‌ చేతిలో ఓడిపోయింది. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలిమహిళగా పేరొందిన సైనా మొదటి రౌండ్లోనే కాక రెండో రౌండ్‌లోను కూడా నిరాశపరిచి ఓటమి పాలైంది.

ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్, ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ యూత్ క్రీడలు ఇంకా జాతీయ క్రీడలలో స్వర్ణపతకం సాదించిన సైనా నెహ్వాల్‌ ఈ రెండిట్లో ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేక 12-21 తేడాతో ఓడిపోయింది.