ఓటీటీలోకి వచ్చేసిన సైంధవ్ మూవీ ..ఎక్కడ చూడొచ్చు?

ఓటీటీలోకి వచ్చేసిన సైంధవ్ మూవీ ..ఎక్కడ చూడొచ్చు?
Cinema News

హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన తాజా మూవీ సైంధవ్‌ . ఈ మూవీ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.వెంకటేష్‌ నటించిన 75వ మూవీ కి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మించారు. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రావడంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓటీటీలోకి వచ్చేసిన సైంధవ్ మూవీ ..ఎక్కడ చూడొచ్చు?
Saindhav Movie

ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. అయితే,విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతుంది. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది.