AP Politics: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో ఇన్‌పుట్ సబ్సిడీ

Election Updates: Good news for AP farmers.. 11.59 lakh people will benefit
Election Updates: Good news for AP farmers.. 11.59 lakh people will benefit

ఏపీ రైతులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త. మిచౌంగ్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని సిఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు.

దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు. వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటికి ఇబ్బందిలేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆదిత్య విద్యాసంస్థలు (కాకినాడ జిల్లా), అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ (రాజంపేట), గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ (రాజమండ్రి)కి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో 70% సీట్లతో పాటు కొత్తగా ఏర్పడే పరిస్థితిల్లో 35% సీట్లను కన్వీనర్ కోటాకు కేటాయించాల్సి ఉంది.