స్వాగ్ సే స్వాగ‌త్ రికార్డ్

salman-and-katrina-Swag-Se-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ మాజీ ల‌వ్వ‌ర్స్ స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం టైగ‌ర్ జిందా హై. 2012లో వ‌చ్చిన ఏక్ థా టైగ‌ర్ కు ఈ చిత్రం సీక్వెల్. సినిమాలోని తొలిపాట‌ స్వాగ్ సే స్వాగ‌త్ ను చిత్ర‌బృందం ఇటీవ‌ల విడుద‌ల‌చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విడుద‌ల‌యిన 24 గంట‌ల్లోనే కోటిమంది ఈ సాంగ్ ను వీక్షించారు. మూడుల‌క్ష‌ల‌కు పైగా లైకులు వ‌చ్చాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌మంది చూసిన పాట ఇదే. అంత‌ర్జాతీయ ఆల్బ‌మ్స్ ను కూడా ఈ సాంగ్ బీట్ చేసింది.

టైగ‌ర్ జిందా హై నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాలు వెల్ల‌డించింది. ఈ సినిమాపై ఇప్ప‌టికే బాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి. సూప‌ర్ హిట్ట‌యిన ఏక్ థా టైగ‌ర్ కు సీక్వెల్ కావ‌డంతో పాటు..స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ క‌లిసి న‌టించ‌డంతో …సినిమా విడుద‌ల కోసం హిందీ ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ర‌ణ‌బీర్ క‌పూర్ తో డేటింగ్ చేసి విడిపోయిన తర్వాత క‌త్రినా మాజీ ల‌వ్వ‌ర్ స‌ల్మాన్ తో న‌టించ‌డం బాలీవుడ్ లో ఆస‌క్తి క‌లిగిస్తోంది. డిసెంబ‌ర్ 22న క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానునంది.