చైతూ, స‌మంత‌ల రిసెప్ష‌న్ కూడా రెండుసార్లు

sam and chay Reception Ceremony Also Celebrating Twice

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ కొత్త జంట నాగ‌చైత‌న్య‌, స‌మంతల గ్రాండ్ రిసెప్ష‌న్ కు ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. గోవాలో వివాహ మ‌హోత్స‌వానికి ఎక్కువ‌మందిని పిల‌వ‌క‌పోవ‌డంతో రిసెప్ష‌న్ కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రినీ ఆహ్వానించాల‌ని నాగార్జున భావిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో హైద‌రాబాద్ లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. అయితే గోవాలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌కు రెండుసార్లు పెళ్లిజ‌రిగిన‌ట్టుగా…వారి రిసెప్ష‌న్ కూడా రెండుసార్లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

చైత‌న్య హిందూ కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక‌సారి, స‌మంత క్రిస్టియ‌న్ మ‌తానికి చెందినది కావ‌డంతో వారి ప‌ద్ధ‌తిలో మ‌రోసారి ఈ ప్రేమ‌ప‌క్షులు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో నాగ‌చైత‌న్య రిసెప్ష‌న్ కూడా హైద‌రాబాద్, చెన్నైల్లో జ‌ర‌గ‌నుంది.చైత‌న్య త‌ల్లి, రామానాయుడు కుమార్తె ల‌క్ష్మి చెన్నైలో ఉంటారు. దీంతో త‌న కొడుకు కోడ‌లిని చెన్నై తీసుకెళ్లి రిసెప్ష‌న్ నిర్వ‌హించాల‌ని ఆమె భావిస్తున్నారు. హైద‌రాబాద్ రిసెప్ష‌న్ క‌న్నా ముందు చెన్నై రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ద‌గ్గుబాటి కుటుంబ‌మంతా ఈ వేడుక‌కు త‌ర‌లివెళ్ల‌నుంది.