ఆ సినిమాకు సమంత ఫైనాన్స్‌ చేసిందా?

samantha-akkineni-helping-f

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

అక్కినేని వారి కోడలు సమంత తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. అందమైన రూపం ఉన్న సమంత మనస్సు కూడా చాలా అందమైనది అంటూ ఆమెను సన్నిహితంగా చూసిన వారు అంటూ ఉంటారు. ఆమె తనకు ఆప్తులు అనుకున్న వారికి ఎంత సాయం అయినా చేసేందుకు సిద్దం అవుతుంది. సమంత తన వద్ద చాలా కాలం మేనేజర్‌గా చేసిన మహేందర్‌ అనే వ్యక్తిని నిర్మాతగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇండ్రస్టీలో పలువురు హీరోలకు మరియు హీరోయిన్‌లకు మేనేజర్‌గా వ్యవహరించిన మహేందర్‌ తాజాగా నారా రోహిత్‌ హీరోగా బాలకృష్ణుడు అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే.

samantha

నారా రోహిత్‌, రెజీనా జంటగా నటించిన ‘బాలకృష్ణుడు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా నిర్మాణంలో సమంత కూడా తన వంతు సాయం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సమంత దాదాపు మూడు కోట్ల ఫైనాన్స్‌ను చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. మహేందర్‌ రెడ్డి ఇటీవలే సినిమా బిజినెస్‌ పూర్తి అవ్వడంతో రెండు కోట్లు సమంతకు తిరిగి ఇచ్చాడని, సినిమా విడుదల తర్వాత మిగిలిన మొత్తానికి నిర్మాత ఇవ్వనున్నాడు. తన అనుకున్న వారికి సమంత చేసే సాయం ఎలా ఉంటుందో దీన్ని చూస్తే అర్థం అవుతుంది.