లోకేష్ మీద పోసాని ఫైర్… అవార్డు వెనక్కి.

posani krishna murali fires on Nara Lokesh about Nandi Awards

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నంది అవార్డుల వివాదం సమసిపోతోంది ఆనుకుంటున్న టైం లో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. నటుడు , రచయిత , నిర్మాత , దర్శకుడు ఇలా అన్ని పాత్రలు పోషించిన పోసాని ఒక్కసారిగా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. NRA లకు నందుల మీద విమర్శలు చేసే హక్కు ఎక్కడుందని ప్రశ్నించిన లోకేష్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. కెసిఆర్ ని  చూసి  నేర్చుకోవాలని లోకేష్ కి పోసాని సూచించారు. ఇక లోకేష్ కి వ్యతిరేకంగా పోసాని ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.

1 . టాక్స్ ఇక్కడ కడితే అక్కడ విమర్శ చేయడానికి పనికిరారా? అయితే మీరు ఇక్కడ టాక్స్ కట్టడం లేదా ? ఏపీ లో ప్రభుత్వం వచ్చాక కూడా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు ?

2 . గతంలో చంద్రబాబు ఏదైనా విమర్శలు చేసినప్పుడు ఆయన్ని నాన్ లోకల్ అని ఎవరైనా అన్నారా ?

3 . నాన్ లోకల్స్ కి విమర్శించే హక్కు లేదు అనుకుంటే ఇప్పుడు జ్యూరీ లో వున్నవాళ్లు కూడా హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉన్నవాళ్లే కదా ? వారిని ఎలా జ్యూరీ లోకి తీసుకున్నారు ?.

4 . పద్మ, భారత రత్న అవార్డుల మీద కూడా విమర్శలు వచ్చాయి. అలా అని వాటిని తీసేసారా ?

5 . రాద్ధాంతం జరిగిందని నందులు తీసేస్తే , అంత కన్నా ఎక్కువ రాద్ధాంతం పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద జరిగింది . మరి వారిని ఎందుకు తీసేయలేదు ?

ఇలా ప్రశ్నలు సంధించిన పోసాని మమ్మల్ని తెలుగు రోహింగ్యాలు చేసారంటూ ఆవేదన చెందారు. టెంపర్ కి తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డు తిరస్కరిస్తున్నట్టు పోసాని ప్రకటించారు. కమ్మోడు కాబట్టి అవార్డు ఇచ్చారని అనుకునే అవకాశం వుంది కాబట్టి దాన్ని తీసుకోబోనని పోసాని చెప్పారు. ప్రస్తుతం ప్రకటించిన అవార్డులను రద్దు చేసి చంద్రబాబు చెప్పినట్టు ivrs పద్ధతిలో మళ్లీ ఎంపిక జరపాలని పోసాని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పోసాని ప్రెస్ మీట్ ఇప్పుడు ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు రేపుతోంది.