ఇవాంకకు గిఫ్ట్‌ ఇవ్వబోతున్న సమంత

samantha akkineni special gift for ivanka trump

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సదస్సు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక హాజరు కాబోతుంది. ఆమెకు ప్రత్యేక ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో దిగిన ఇవాంకకు సమంత చేతుల మీదుగా ఒక అరుదైన బహుమానంను ఇప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది.

US-President-Donald-Trump's

 

గత కొంత కాలంగా సమంత తెలంగాణ చేనేత వస్త్ర వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ పారిశ్రామిక సదస్సులో కూడా చేనేతను ప్రమోట్‌ చేసేందుకు సమంతతో ఇవాంకకు చేనేత చీరను ఇప్పిస్తున్నారు.పారిశ్రామిక సదస్సు సందర్బంగా హైదరాబాద్‌కు వచ్చిన ఇవాంకకు తెలంగాణ ప్రభుత్వం పలు బహుమానాలు ఇచ్చేందుకు ఇప్పటికే సిద్దం చేసిన విషయం తెల్సిందే. అందులో భాగంగా చేనేత చీరను కూడా బహుమానంగా ఇస్తున్నారు.

samantha--gift-for-Trump's-

ఇతర బహుమానాలను సీఎం కేసీఆర్‌ ఇవ్వనుండగా, చేనేత చీరను మాత్రం ఇవాంకకు సమంత ఇవ్వబోతుంది. సమంతకు ఈ అరుదైన అవకాశం కేటీఆర్‌ చొరవ వల్ల దక్కిందని చెప్పుకోవచ్చు. సమంత చేస్తున్న కృషి కారణంగా తెలంగాణలో చేనేత వస్త్రాలకు ఆధరణ పెరిగింది. ఆ కారణంగానే సమంతకు గౌరవించాలనే ఉద్దేశ్యంతో ఇవాంకకు సమంత చేతుల మీదుగా చీరను ఇప్పించాలని కేటీఆర్‌ నిర్ణయించుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సమంతకు దక్కిన ఈ అరుదైన గౌరవం టాలీవుడ్‌ మొత్తానికి వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. సమంత టాలీవుడ్‌ ఖ్యాతిని పెంచింది.