పొలిటికల్‌ ఎంట్రీపై సమంత కామెంట్స్‌

Samantha Comments on political Entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ సమంత ఇటీవలే అక్కినేని వారి ఇంటి కోడలు అయిన విషయం తెల్సిందే. గత కొంత కాలంగా అక్కినేని వారికి టీఆర్‌ఎస్‌ పార్టీకి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇక తెలంగాణ చేనేత పరిశ్రమకు సమంత స్వచ్చందంగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. సమంత మంచి మనసును పలు సందర్బాల్లో, పలు వేదికల మీద స్వయంగా కేటీఆర్‌ ప్రశంసించిన విషయం తెల్సిందే. సమంతపై మంచి అభిప్రాయం ఉన్న కేటీఆర్‌ ఆమెకు సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానంను ఆఫర్‌ చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది. సమంత కూడా అక్కినేని వారి ప్రోత్బలంతో పోటీకి సై అంటుంది అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పొలిటికల్‌ ఎంట్రీపై మీడియాలో వస్తున్న వార్తలపై సమంత స్పందించింది. తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఒక్క శాతం కూడా లేదని, లేనిపోని వార్తలతో సమయంను వృదా చేసుకోవద్దంటూ సోషల్‌ మీడియా జనాలకు సమంత సూచించింది. స్వచ్చంద సంస్థతో మంచి చేస్తూ ఉన్న సమంత రాజకీయాల్లోకి వస్తే మరింత మంచి చేయవచ్చు అంటూ అభిమానులు కొందరు ఆమెను రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. కాని సమంత మాత్రం సినిమాలు, తన కుటుంబం మినహా మరేం అక్కర్లేదని చెబుతూ వస్తుంది. తన ప్రత్యుష పౌండేషన్‌ ద్వారా సాధ్యం అయినంత మేరకు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటాను అని, రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన ఎక్కువ ప్రజా సేవ చేయవచ్చు అనేది నమ్మను అంటూ ఈమె చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత రాజకీయ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చేసింది.