శ్రీ రెడ్డి భర్తకి సమంతా కేక్ తినిపించిందట….పాపం !

Samantha fed the cake to Sri Reddy's husband

ఓ బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌కి సమంత మా ఆయన్ని మాత్రమే పిలిచి కేక్‌లు కట్ చేసుకున్నారు. నేను హర్టూ.. మా ఆయన కోతి వేషాలు చూడండహో’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. సమంత ‘ఓ బేబీ’ హిట్ కావడం వరకూ సరే, సక్సెస్ అయినందుకు కేక్ కటింగ్ చేసుకున్న సంగతీ నిజమే మరి ఈ సక్సెస్ మీట్‌కి శ్రీరెడ్డి భర్త రావడం ఏంటి? శ్రీరెడ్డి భర్తను వదిలేసి సింగిల్‌గా ఉంటుందిగా.. ఈ కొత్త భర్త ఎవరబబా అనుకుంటున్నారా ? దగ్గుబాటి వారసుడు,  శ్రీరెడ్డి మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం వరకూ అభిరామ్ పేరు ఇండస్ట్రీలో ఉన్నవారికి తప్ప బయటవారికి పెద్దగా పరిచయం లేదు. అభిరామ్‌ను సినీ జనానికి పరిచయం చేసేసింది శ్రీరెడ్డి. తన ప్రియుడు అభిరామ్‌‌ను భర్తగా సురేష్ బాబుని మామగా రానాను బావగా చివరికి వెంకటేష్‌ను చిన మామగా వరసలు కలిపిస్తూ పోస్ట్‌లు వదలుతూ ఉంటుంది. ఈలెక్కన సమంత, చైతులు కూడా ఆమెకు చుట్టాలే కావడంతో వాళ్లపై కూడా అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తుంది. తాజాగా సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రం శుక్రవారం నాడు విడుదలై విజయవంతం కావడంతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ విజయోత్సవంలో సమంత తన యూనిట్‌ కలిసి కేక్ కట్ చేశారు. ‘ఓబేబీ’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో విడుదల కాగా ప్రొడ్యుసర్ అభిరామ్‌ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత కేక్ కట్ చేసి అభిరామ్‌కి తినిపించారు. అనంతరం యూనిట్‌తో కలిసి డాన్స్‌లు చేశారు అభిరామ్. కాగా ఈ వేడుకకు తన భర్త అభిరామ్‌ను మాత్రమే సమంత పిలిచిందని కామెంట్స్ చేసింది.