Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ ప్రేక్షకులను ఏమాయ చేసిందో కాని దాదాపు పది సంవత్సరాలుగా సమంతను అభిమానిస్తూనే ఉన్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని, దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసేసింది. అత్యధిక పారితోషికం అందుకోవడంతో పాటు, పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో కూడా సమంత నటించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సమంత ఒక రేంజ్‌లో భారీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. తమిళనాట ఈ అమ్మడి రేంజ్ ఆకాశాన్ని తాకుతుంది. తెలుగు మరియు తమిళంలో తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు త్వరలో హిందీలో కూడా తన జర్నీని ప్రారంభించేందుకు సిద్దం అవుతుంది.
తెలుగు హీరో నాగచైతన్యతో ఈ అమ్మడి వివాహం ఈనెల 6న జరుగబోతుంది. గోవాలో ఇప్పటికే వీరి పెళ్లికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెళ్లి కోసం దాదాపు నెల రోజు గ్యాప్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి, బాలీవుడ్‌లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడికి బాలీవుడ్‌లో చాలా కాలంగానే ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో వస్తున్న ఆఫర్లకు ఈమె సున్నితంగా నో చెబుతూ వచ్చింది. తాజాగా వచ్చిన ఆఫర్ ఈమెకు నచ్చడంతో పాటు, చైతూ కూడా ఆసక్తి చూపించడంతో కాదనలేక పోయింది.
సమంత పెళ్లి తర్వాత కమిట్ కాబోతున్న మొదటి సినిమా ఆ హిందీ సినిమా అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్న ఒక సినిమాలో ఈమెకు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. తెలుగు మరియు తమిళంలో తన సత్తా చాటిన ఈ అమ్మడు త్వరలోనే హిందీలో కూడా రాణిస్తుందా అనేది చూడాలి. హిందీలో రూపొందబోతున్న ఆ సినిమా విశేషాలు ఏంటీ అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. హిందీలో సక్సెస్ అయితే తెలుగు మరియు తమిళంను ఈ అమ్మడు వదిలేస్తుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని సమంత పెళ్లి చేసుకోబోతున్నది చైతూను కాబట్టి ఆమె టాలీవుడ్‌ను వదిలేసి ఎక్కడకు వెళ్లదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.