మరోసారి నాగ్‌ సినిమాలో..?

Samantha In Nagarjuna and Nani Multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని వారి ఇంటి కోడలు అయిన సమంత ఇటీవల వరుసగా చిత్రాలకు కమిట్‌ అవుతూ వస్తుంది. పెళ్లి కాకముందు నాగార్జున నటించిన ‘మనం’, ‘రాజు గారి గది’ చిత్రాల్లో సమంత నటించిన విషయం తెల్సిందే. పెళ్లి అయిన తర్వాత మరోసారి మామ నటించబోతున్న సినిమాలో సమంత నటించనుంది. నాగార్జున, నానిలు కలిసి శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నానికి జోడీగా సమంత కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

నానితో ఇప్పటికే సమంత రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి ‘ఎటో వెళ్లి పోయింది మనసు’ మరియు రెండవది ‘ఈగ’. ఈ రెండు చిత్రాలు కూడా వీరిద్దరి జంటకు మంచి పేరు వచ్చింది. దాంతో వీరిద్దరు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల్లో నమ్మకం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం చరణ్‌ సరసన ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తోన్న సమంత ఆ చిత్రం పూర్తి అయిన తర్వాత నానికి జోడీగా నటించబోతుంది. భారీ అంచనాలున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో సమంత కూడా జాయిన్‌ అయితే ఆ సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం. ఈ వార్తలపై నిర్మాత అశ్వినీదత్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరో వైపు నాగచైతన్యతో కూడా సమంత ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు మరియు తమిళంలో పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా చిత్రాలను చేస్తూ ఈ అమ్మడు దూసుకు పోతుంది.