తిరిగి టాలీవుడ్ లో సినిమా తీయనున్న సందీప్ వంగా

తిరిగి టాలీవుడ్ లో సినిమా తీయనున్న సందీప్ వంగా

అర్జున్ రెడ్డి చిత్రంతో సందీప్ రెడ్డి వంగా రాష్ట్రమంతటా మారుమ్రోగిపోయింది. అంతేకాకుండా పోస్టర్, ట్రైలర్ తోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సందీప్ రెడ్డి, వివాదాలు కూడా అలానే చుట్టుముట్టాయి. అయితే అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ లో ఎంత పెద్ద ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే సందీప్ రెడ్డి బాలీవుడ్ లో ఇదే చిత్రాన్ని రీమేక్ చేసి షాహిద్ కపూర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే మరో పెద్ద అవకాశం సందీప్ ని వరించింది. రణబీర్ కపూర్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందని అపుడు వార్తలు వచ్చినా. ప్రస్తుతం రణబీర్ బిజీ గా ఉండటంతో సందీప్ ఖాళీగా ఉంటున్నాడు. అయితే టీ సిరీస్ సంస్థ సందీప్ కోసం మరో అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది.

టీ సిరీస్ తో రన్బీర్ కపూర్ తో చేయాల్సిన చిత్రం కాకుండా, టాలీవుడ్ లో మరొక హీరోతో సినిమా తీసేందుకు అంగీకరించింది. అయితే బాలీవుడ్ బాట పట్టిన సందీప్ మళ్ళీ సొంత గూటికి చేరనున్నారు. ఇంకొక హిట్ దక్కితే బాలీవుడ్ లో అగ్ర దర్శకులకు కంపెటిషన్ ఇచ్చేవాడని చాల మంది భావించారు. కానీ సందీప్ ఫేట్ మారడం తో తిరిగి టాలీవుడ్ లో సినిమా తీయనున్నారు. మరి ఈ హీరో తో సందీప్ సినిమా తీస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.