చైనాలో ప్రకృతి బీభత్సం

చైనాలో ప్రకృతి బీభత్సం

చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. ఓ విపత్తు నుంచి మరో విపత్తు వచ్చి పడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాలోని వాయువ్య భాగంలో 100 మీటర్ల పొడవున ఎత్తైన ఇసుక తుఫాన్‌ డున్హువాంగ్ నగరాన్ని ముచ్చెత్తింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇసుక తుఫాను కారణంగా నగరం మొత్తం దట్టమైన దుమ్ము కమ్ముకుంది. ఇసుక తుఫాను దెబ్బకు స్థానికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక మంది పౌరులకు, ముఖ్యంగా వృద్ధులకు శ్వాసకోశ సమస్య ఉన్న రోగులకు కష్టకాలంగా దాపురించింది. గోబీ ఎడారి అంచున ఉన్న ఈ నగరం చాలా సార్లు ఇలాంటి విపత్కర పరిస్థితులకు గురవుతూనే ఉంది.