సామాన్యురాలు సంజన రీఎంట్రీ ఇస్తుందా?

sanjana Anne re entry on bigg boss House

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో సామాన్యులుగా ముగ్గురు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సామాన్యురాలిగా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన సంజన స్టార్‌ సెబ్రెటీ కంటే ఎక్కువగా షోలో ప్రవర్తించింది. ఇతరుల పట్ల కనీస మర్యాద, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వారితో దురుసుగా మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెట్టింది. సంజన ప్రవర్తన బాగాలేక పోవడం వల్లే ప్రేక్షకులు ఆమెను మొదటి వారంలోనే ఇంట్లోంచి బయటకు పంపించారు. షోలో ఉన్న వారిని బయటకు వచ్చిన తర్వాత కూడా సంజన టార్గెట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఇక హోస్ట్‌ అయిన నానిపై కూడా సంజన విమర్శలు చేసింది. ఇలాంటి సంజనను మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించే అవకాశాలున్నాయంటూ కొందరు అంటున్నారు.

తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 అంతగా ఎక్కడం లేదు. అందుకే ఏదైనా సంచలనం సృష్టించేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగు బిగ్‌బాస్‌ గత సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన పార్టిసిపెంట్‌ను రీ ఎంట్రీ ఇప్పించారు. దాంతో మంచి క్రేజ్‌ దక్కింది. విభిన్నంగా సంజనను రీ ఎంట్రీ ఇచ్చేలా చేయడం వల్ల షోకు భారీగా క్రేజ్‌ దక్కుతుందని, అప్పుడు టీఆర్‌పీ భారీగా వస్తుందనే అభిప్రాయంతో స్టార్‌ మా వారు ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో సంజనకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌తో స్టార్‌ మా వారిని ఒప్పించి మళ్లీ రీ ఎంట్రీకి సంజన ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. సంజన చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతుందో లేదో చూడాలి. మొదటి వారం పూర్తి అయిన వెంటనే ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అయ్యింది. మళ్లీ అయిదు వారాల తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఆ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ సంజనది ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.