టీడీపీది దొంగ దీక్ష, చంద్రబాబు ఫోన్ చేసి అడుగుతున్నారు !

Janasena gives Counter to CM Ramesh Hunger Strike

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపనే లక్ష్యంగా చేస్తున్న తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని జనసేన విమర్శించింది. కేంద్రంలో అధికారం పంచుకున్నంత కాలం కడప ఉక్కు విషయాన్ని తెలుగు దేశం ప్రభుత్వం పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు చేస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి లేదని తెలిపింది. కడప ఉక్కు సాధన కోసం ఈ నెల 29న అఖిలపక్షం చేపట్టే రాష్ట్ర బంద్ కు జనసేన మద్దతు ఇస్తుందని పార్టీ ప్రకటించింది. ఆరోజు జరగనున్న బంద్ లో పార్టీ శ్రేణులు పాలుపంచుకొంటాయని సమాచారం. కడపలో ఉక్కు కర్మాగారం పెట్టడానికి కేంద్రం నిరాకరించినా బీజేపీని ఒక మాట అనకుండా దానిని కూడా టీడీపీ ప్రభుత్వం అకౌంట్ లో వేసేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి… ఆసుపత్రికి తరలించమంటారా? అని అడుగుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలమని ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదాసు ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. అక్కడితో ఆగకుండా విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. పవన కళ్యాణ్ కేంద్రం పై పోరాడే తీరు అందరికీ ఆదర్శం అని అన్నారు. దీనితో అక్కడ ఉన్న మీడియా వారు కంగుతిన్నారు. సరే ప్రత్యర్థి పార్టీ కాబట్టి టీడీపీ దీక్షను విమర్శించవచ్చు. కాకపోతే అసలు ఏం చేశారని జనసేన పోరాట తీరు అందరికి ఆదర్శమో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. కేంద్రం కూడా ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం… విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐరన్ ఓర్ గనులను కూడా కేటాయించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం పట్ల బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని జనసేన కోరింది.