అతడికి కూడా రెండవ పెళ్లే!

Renu Desai second Marriage Husband had a daughter

రేణుదేశాయ్‌ రెండవ వివాహంకు సిద్దం అయ్యింది. గత ఆదివారం రేణుదేశాయ్‌ వివాహ నిశ్చితార్థం సింపుల్‌గా, ఫ్యామిలీ మరియు స్నేహితుల సమక్షంలో జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక రేణుదేశాయ్‌ వివాహం చేసుకోబోతున్న వ్యక్తి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. రేణుదేశాయ్‌ కనీసం అతడి ఫొటోను కూడా విడుదల చేయలేదు. రేణుదేశాయ్‌కి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అంటే భయం, ఆ కారణంగానే తనకు కాబోయే భర్త ఫొటోను కాని, అతడి వివరాలను కాని రివీల్‌ చేయలేదు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో రేణు చేసిన ఒక పోస్ట్‌ కారణంగా అతడికి అంతకు ముందు పెళ్లి అయ్యిందని, అతడు భార్య నుండి దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. అతడితో పాటు కూతురు కూడా ఉంటుందని తేలిపోయింది.

తాజాగా తన కూతురు ఆద్యతో ఒక పాప ఉన్న ఫొటోను రేణుదేశాయ్‌ పోస్ట్‌ చేసింది. ఈ పాప పేరు ఎంజెలికా, ఈమె మొన్నటి వరకు ఆద్యకు స్నేహితురాలు మాత్రమే, ఇకపై మాకు కుటుంబ సభ్యురాలు అంటూ పేర్కొంది. దాంతో రేణుదేశాయ్‌ వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి ఇంతకు ముందే వివాహం అయ్యిందని, మొదటి భార్య కారణంగా అతడికి కూతురు కూడా ఉందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత ఆ పాప వీరితో పాటే ఉంటుందని కూడా రేణుదేశాయ్‌ పోస్ట్‌తో వెళ్లడైంది. మొత్తానికి ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన రేణుదేశాయ్‌ పెళ్లి తర్వాత మరో పాపకు కూడా తల్లి అవ్వబోతుందన్న మాట. రేణుదేశాయ్‌ తన రెండవ భర్త ద్వారా కూడా పిల్లలకు జన్మనిస్తుందేమో చూడాలి. ఒక వేళ మళ్లీ రేణుదేశాయ్‌ తల్లి అయితే ఆమె కుటుంబం మరింతగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.