ప్రేమ కాదు పెళ్లి మాత్రమే అంటున్న రేణు దేశాయ్… ఆ సీక్రెట్స్ అలాగే

Renu Desai doesn't say second Marriage Husband details

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి ఏడేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోవడం మీద ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు చూసి రేణు మళ్లీ ప్రేమలో పడి పెళ్ళికి ఓకే చెప్పిందని అనుకుంటున్నారు. అయితే అందులో నిజం లేదని తెలిసింది. ఈ విషయాన్ని రేణు స్వయంగా ఓ ఇంగ్లీష్ పత్రికకు వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితంలోకి వస్తున్న వ్యక్తి ని సన్నిహితులే సెలెక్ట్ చేసినట్టు ఆమె తెలిపారు. జీవితంలో ప్రేమ ఒక్కసారే పుడుతుందని రేణు అభిప్రాయపడ్డారు. ఏడేళ్లు ఒంటరి జీవితం కూడా సంతోషంగా గడిపానని, ఇప్పడు పెళ్లి తర్వాత కూడా అదే సంతోషంతో జీవితాన్ని ముందుకు సాగించగలనని ఆమె చెప్పుకున్నారు. తన జీవితంలోకి వస్తున్న వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంటారని రేణు మురిపెంగా చెప్పుకున్నారు. అందుకే సహజీవనం గురించి కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆమె వివరించారు.

రేణు తాజా కామెంట్స్ చూస్తే ప్రేమ పెళ్లిళ్లు కాకపోయినా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతో కూడా సజావుగా జీవితం గడపొచ్చని భావిస్తున్నట్టు వుంది. సంప్రదాయాల ద్వారా కొంత భద్రత, భరోసా కలుగుతుందన్న అభిప్రాయం ఆమె మాటల్లో వ్యక్తం అయ్యింది. గత అనుభవం దృష్ట్యా రేణు ఇలా మాట్లాడి ఉండొచ్చు. అయితే అందరి జీవితాల్లో ఒకే రకమైన అనుభవాలు ఉండకపోవచ్చు. సెలెబ్రిటీలు కాబట్టి రేణు , పవన్ ల బంధం, పెళ్లి, విడాకుల గురించి ఇంత చర్చ సాగుతోంది.

పవన్ నుంచి విడిపోయిన ఈ ఏడేళ్లలో అన్ని విషయాల మీద చురుగ్గా అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ వస్తున్న రేణు ఇప్పటికీ రెండు విషయాల్లో మాత్రం సీక్రెట్స్ ని అలాగే ఉంచుతోంది. పవన్ తో అభిప్రాయభేదాలు ఎందుకు వచ్చాయి అన్న విషయంలో రేణు ఎప్పుడూ నోరు ఎత్తలేదు. ఇక కాబోయే పెళ్లి గురించి అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేస్తున్న రేణు కొత్త పెళ్లి కొడుకు ఎవరు అన్న విషయాన్ని మాత్రం సీక్రెట్ గా ఉంచుతోంది.