దేవుడి మీద ఒట్టు ఆ వ్యక్తి గురించి కాదు…పూనం ట్వీట్ !

poonam kaur tweets going viral on social media

చాన్నాళ్ళ క్రితమే తెలుగు చలన చిత్ర సీమ లోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా పెద్దగా రాణించలేకపోయిన పూనమ్ కౌర్ కత్తి మహేష్ పుణ్యమా అని పవన్-కత్తి వివాదంలో ఆమె పేరు రావడంతో ఆ తర్వాత అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తోంది. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని ట్వీట్లు చేస్తున్నట్టు ఉండే ఆమె ట్వీట్లు మరోసారి తన ట్వీట్‌తో కవ్వించే ప్రయత్నం చేసింది.

‘దేవుడి మీద ఒట్టు.. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి గురించి కాదు. ఓ వ్యక్తి తనను తాను కాపాడుకునేందుకు న్యూస్ ఛానెళ్లలో ఒకరి గురించి మంచిగా మాట్లాడటం ప్రారంభించాడు. మీ దేవుడిపై దాడికి ప్రధాన కారణమైన అతడు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. నేనెప్పుడూ రంగులు మార్చలే’దంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ఎవరిని టార్గెట్ చేసిందో స్పష్టంగా తెలియకుండా పూనమ్ ట్వీట్ చేసినా ఆమె ట్వీట్‌ చూసి పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. రేణూ దేశాయ్‌కి జనసేనాని శుభాకాంక్షలు చెప్పిన కాసేపటికే ఆమె ట్వీట్ చేయడం మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.