క‌ర‌ణం బ‌ల‌రాం..ప్లాన్ ఇదేనా ?

prakasam district hot topic on political changes in karanam Balaram

రాజకీయాల మీదఆసక్తి ఉన్నవారికి ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు భ‌లే పసందుగా అనిపిస్తాయి. ఎందుకంటే అటు కోస్తా, ఇటు సీమ ఈ రెండింటి రాజకీయం కలబోస్తే ప్రకాశం రాజీయం పుట్టుకొచ్చిందా అనిపిస్తుంది. పైగా గ్రూపు త‌గాదాలు గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఇప్పుడంటే మావోయిజం ప్రాబ‌ల్యం తగ్గాక కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో మన నన్నల తరం వారికి బాగా తెలుసు, అటువంటి మొండి జిల్లాలో క‌ర‌ణం బ‌ల‌రాం అంటే ప్రకాశం రాజకీయం అన్న రేంజ్ లో చక్రం తిప్పాడు ఆయన. టీడీపీలో తిరుగులేని నేత‌ అనిపించుకున్న ఆయనకీ 2009, 2014లో అద్దంకిలో ఓట‌మి త‌ప్ప‌లేదు. తాను అధికారంలో లేకపోయినా 2014లో తన పార్టీ టీడీపీ అధికారంలోకి రావ‌టంతో నియోజ‌క‌వ‌ర్గంలోను.. జిల్లావ్యాప్తంగా త‌న‌దే హ‌వా అని క‌ర‌ణం భావించాడు. కానీ అద్దంకి నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ సైకిల్ ఎక్క‌టంతో ఆయ‌న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఫ‌లితంగా.. ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జరిగి ఆ విభేదాలు పార్టీ పరువును బజారున పడేసెంత వరకు వెళ్ళాయి.

పైగా మంత్రుల సమక్షంలో ఓ గ్రామంలో జ‌రిగిన గొడ‌వ‌తో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. ఒకానోక స‌మ‌యంలో క‌ర‌ణం బ‌ల‌రాం.. టీడీపీ అధినేత‌నే దిక్క‌రించేంత వ‌ర‌కూ చేరారు. అయితే దీంతో కేడ‌ర్ దెబ్బ‌తింటుంద‌నే ఉద్దేశంతో స్వ‌యంగా చంద్ర‌బాబు జోక్యం చేసుకుని దీన్ని ప‌రిష్క‌రించారు. అద్దంకి విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్దంటూ హెచ్చరించి దానికి ప్రతిఫలంగా క‌ర‌ణం బ‌ల‌రాంను ఎమ్మెల్సీ చేశారు.కానీ కరణం మాత్రం రానున్న ఎన్నికల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన, మరో నియోజకవర్గం నుండి ఆయన కుమారుడు ఇలా ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెల‌వాల‌ని ఆశ‌ప‌డుతున్నాడట బ‌ల‌రాం. అదికుద‌ర‌క‌పోతే ఆయన ఒంగోలు ఎంపీగా అయినా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. మరోపక్క వైసీపీ కూడా ఆయన్ని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో ప్రకాశం రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి.