సంక్రాంతి సినిమాలు వార్ కు అంతా సిద్దం…!

Sankranthi Movies Are All Ready For War

తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో ఈ సంక్రాంతికి సినిమాల జోరు కొనసాగుతుంది. తమిళనాడులో అజిత్ నటించిన విశ్వాసం, రజినీకాంత్ పెటా సినిమా ఆక్కడ పొంగల్ కి పోటి పడుతున్నాయి. తెలుగులో మాత్రం మూడు స్టార్ హీరోస్ సినిమాలు ఒక్క డబ్బింగ్ సినిమా విడుదలవుతుంది. ఇప్పుడు ఈ మూడు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రతి సంక్రాంతి కి అలవాటుగా సినిమాను విడుదల చేస్తున్న నందమూరి ఫ్యామిలీ, మెగస్టార్ ఫ్యామిలీ మద్య పోటి ఉత్కంట భరితంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ మొత్తం నాలుగు చిత్రాలకు రన్ టైం లాక్ ను విధించారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి రెండు గంటల యబైఒక్కటి నిమిషంగా రన్ లాక్ ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ రెండు భాగాలగు విడుదలవుతుంది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో రెండోవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు.

కార్తీక్ సుబ్బా రాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పెటా రన్ టైం లాక్ రెండు గంటల యాబై రెండు నిముషాలుగా లాక్ చేశారు. రజినీ సరసన త్రిష, సిమ్రాన్ కథానాయకలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం యొక్క రన్ లాక్ వచ్చేసి రెండు గంటల ఇరవైఅరు నిముషాలు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం విడుదలవుతుంది. ఇకా నల్గోవ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మల్టిస్టారర్ సినిమా ఎఫ్2. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, వెంకటేష్ లు హీరోలుగా నటిస్తున్నారు. వీళ్ళకు జోడిగా తమన్నా, మేహ్రిన్ లు కథానాయకలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క రన్ టైం లాక్ రెండు గంటల ఇరవైఎనిమిది నిముషాలుగా లాక్ చేశారు. ఈ నాలుగు సినిమాలో ఏ సినిమా విజయాని అందుకుంటుందో తెలియాలంటే మరో వారం పాటు అగాలిసిందే.