‘సర్కార్‌’ మూవీ కుమ్మేసింది.. సక్సెస్‌ అయితే ఇంకెలా ఉండేదో…?

Sarkar Movie Reached 250 Crore

విజయ్‌ హీరోగా తెరకెక్కిన తమిళ మూవీ ‘సర్కార్‌’ భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా కూడా 250 కోట్లకు దగ్గరగా వచ్చింది. లాంగ్‌ రన్‌లో 250 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయం అయ్యింది. భారీ ఎత్తున అంచనాలున్న ‘సర్కార్‌’ మూవీ ఓపెనింగ్స్‌ను బాగా రాబట్టింది. అయితే సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చిన కారణంగా 100 కోట్లు రావడమే ఎక్కువ అనుకున్నారు. కాని సినిమా 250 కోట్లను వసూళ్లు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. విజయ్‌, మురుగల మూవీపై ఉన్న అంచనాలే ఇంత భారీ వసూళ్లకు కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమాకు సంబంధించిన ఇంత భారీ వసూళ్లను చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అంచనా వేయలేదు అంటూ సమాచారం అందుతుంది.

Murugadoss-Will-Thank-Varun

‘సర్కార్‌’ మూవీ ఒక వేళ సక్సెస్‌ అయ్యి, సూపర్‌ డూపర్‌ టాక్‌ను దక్కించుకుంటే మరో వంద కోట్లు అంటే 350 కోట్లను దక్కించుకుని ఉండేది అంటూ సినీ వర్గాల వారు విశ్వసం వ్యక్తం చేస్తున్నారు. మురుగదాస్‌ గత చిత్రం స్పైడర్‌ ఫ్లాప్‌ అయినా ఈ చిత్రంపై ప్రేక్షకులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం కూడా వారిని అలరించలేక పోయింది. అయితే కలెక్షన్స్‌ మాత్రం మురుగదాస్‌ స్టార్‌ డంను చూపించాయి. అద్బుతమైన కలెక్షన్స్‌ను రాబట్టిన సర్కార్‌ చిత్రం నిర్మాతలకు పంట పండిచినట్లయ్యింది. నిర్మాతలకు దాదాపుగా 100 కోట్ల వరకు లాభాలు ఉంటాయంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. విజయ్‌ మూవీ అంటే ఆమాత్రం లాభం ఉంటుందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

sarker-movie