బాధ్యత గల సర్పంచ్: కరోనా రాకుండా సర్పంచ్ అఖిల పహారా..

సర్పంచ్ అంటే ఊరికి పెద్దనే కాదు… ఊరికి ఏమొచ్చినా చూసుకొనే పెద్ద మనసు కావాలి. 23 ఏళ్ల అఖిల అదే చేసింది. పిన్న వయసులోనే సర్పంచ్ అయింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామానికి ఆమె సర్పంచ్ గా వారి సేవలు అందిస్తుంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కు చర్యలు తీసుకోవడంతో అఖిల స్వయంగా రంగంలోకి దిగి పహారా కాస్తోంది. మదనాపురం ఊరిలోకి వచ్చే మార్గాలను మూసివేయించింది అఖిల. రాకపోకలకు వీలు లేకుండా రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు వేయటంతో పాటు ముళ్ళ కంపలు పరిచేసేశారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరించడంతో ప్రస్తుతం ఈ ఊరి నుంచి ఎవ్వరూ బయటకు పోవుటం లేదు. బయట వారిని ఊరులోనికి రానివ్వటం లేదు.

అదేవిధంగా ఈ చర్యలు సరిపోవని అనుకున్నారో ఏమోగానీ.. సర్పంచ్ గా అఖిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఊరిలోకి వచ్చే రహదారిపై ఎక్కడైతే ముళ్ళ కంపలు వేసారో అక్కడ ఒక స్టూల్ వేసుకుని చేతిలో కర్ర పట్టుకొని పహారా కూడా కాస్తోంది అఖిల. ఆమె తెగువకు స్థానికుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆమె ఒక్కతే అక్కడ ఉంటూ మదనాపురం ఊరిలోకి ఎవరినీ అనుమతించటం లేదు. తనను సర్పంచుగా ఎన్నుకున్నది కేవలం పదవిని ఎంజాయ్ చేయడానికి కాదని.. చెప్తూ.. ఊరి క్షేమం.. ఊరిలోని వారి ఆరోగ్యం కూడా ముఖ్యమేనని సర్పంచ్ అఖిల స్పష్టం చేస్తుండటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.