ఎస్‌బీఐ నిబంధనలు మారాయి

ఎస్‌బీఐ నిబంధనలు మారాయి

ఎస్‌బీఐ జూలై 1 నుంచే ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను మార్చింది. మారిన నిబంధనలు గుర్తించుకోవాలి. లేదంటే కచ్చితంగా జేబుకు చిల్లు పడుతుంది.స్టేట్ బ్యాంక్ ప్రకారం.. మెట్రో నగరాల్లో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారికి నెలకు 8 ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా చార్జీలు పడతాయి. 8 ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లలో 5 ఎస్‌బీఐ ఏటీఎంలకు వర్తిస్తాయి.

అదే మెట్రో నగరాల్లో కాకుండా ఇతర పట్టణాల్లో ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి నెలకు 10 ఉచిత ఏటీఎం లావాదేవీలు నిర్వహించే అవకాశముంది. ఈ పదిలో 5 లావాదేవీలను ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నిర్వహించొచ్చు. ఇక మిగిలిన ఐదు ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు పడవు.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం బ్యాంక్ మీకు చార్జీలు విధిస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా కూడా ఏటీఎం ద్వారా తీసుకోవాలని వెళ్లినప్పుడు, డబ్బులు తక్కువగా ఉండటం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. అప్పుడు బ్యాంక్ కస్టమర్ నుంచి రూ.20 చార్జీ వసూలు చేస్తుంది. దీనికి జీఎస్‌టీ అదనం. అందువల్ల మీరు ఏటీఎంకు వెళ్లేటప్పుడు అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది.