ఆ నలుగురికి ఉరి శిక్ష ఖాయం

ఆ నలుగురికి ఉరి శిక్ష ఖాయం

వెటర్నరి మహిళా డాక్టర్ దిశ రేప్ అండ్ మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దిశ హత్య కేసులో నింధితులను ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉంచారు.

అయితే దిశ హత్య కేసులో నిందితులపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ వచ్చే అవకాశం లేదని, ఖచ్చితంగా వారి నలుగురికి ఉరి శిక్ష పడుతుందని సీనియర్ న్యాయవాది మహేందర్ రెడ్డి అన్నారు. అయితే ఈ కేసులో కేవలం ఏవిడెన్స్ మాత్రమే ఫాస్ట్రాక్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని, డీఎన్ఏ రిపోర్ట్ కూడా కేసులో కీలకం కానుందన్నారు.