లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి గంటలో ఐటీ, చమురు రంగ షేర్ల అండతో సూచీలు తక్కువ లాభాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 113.11 పాయింట్లు పెరిగి 57,901.14 వద్ద ఉంటే, నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 17,248.40 వద్ద ఉంది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.09 వద్ద ఉంది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బిపీసీఎల్, టైటాన్ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ నిఫ్టీ గెయినర్లలో ఉన్నాయి. నష్టపోయిన వాటివ్ హిందాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, మారుతి సుజుకి, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. ఐటీ, చమురు & గ్యాస్ మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.