లాక్ డౌన్ వేళ బెంగాల్ గాల్స్ తో సెక్స్ రాకెట్.. ఛేదించిన ఏపీ పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ రూరల్ తిమ్మపురం గ్రామంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు రైడ్ చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులను అరెస్ట్ చేసి.. ఇద్దరు సెక్స్‌వర్కర్లకు విముక్తి కల్పించారు. అయితే కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలు, ప్రభుత్వాలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలంటూ మొత్తుకుంటుంటే..

ఈ అక్రమార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. లాక్‌డౌన్ వేళ కూడా తప్పుడు పనులు చేస్తూ.. వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు కావడంతో అందరూ నోరెళ్లబెట్టారు.

అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంట్లో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు గుర్తించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అవంతి నగర్‌లో కొటికలపూడి రాజా, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీష్‌ అనే ముగ్గురు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

బెంగళూరుకు చెందిన రాజేశ్, అప్పాజీ సాయంతో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ చీకటి దందా లాక్‌డౌన్ వేళ కూడా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. కాగా ఈమధ్య పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు నుంచి తీసుకొచ్చి తిమ్మాపురంలో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆ ఇంటికి యువకుల తాకిడి ఎక్కవగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చాలా గుట్టుకు ఆ రహస్యన్ని ఛేదించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.