లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ …పార్వతి గుడ్ అంటోంది.

sexual harassment ghazal srinivas arrested

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పంజాగుట్టలోని ఓ వెబ్ రేడియోలో కుమారి అనే మహిళ గజల్ శ్రీనివాస్ మీద ఆరోపణలు చేశారు. గజల్ శ్రీనివాస్ తన పై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నేడు శ్రీనివాస్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు .

 ghazal srinivas arrested at Punjagutta Police Station

గజల్ శ్రీనివాస్ అరెస్ట్ సంచలనం రేపింది. సినారె శిష్యుడిగా గజల్ శ్రీనివాస్ కి పేరుంది. ఇక సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా గజల్ శ్రీనివాస్ ఉధృతంగా ప్రచారం చేశారు. లగడపాటికి సన్నిహితంగా వ్యవహరించే గజల్ శ్రీనివాస్ ఇప్పుడు ఇలా హఠాత్తుగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 ghazal srinivas arrested

అయితే గజల్ శ్రీనివాస్ కి అనుకూలంగా ఇంకో రేడియో జాకీ గొంతు ఎత్తారు. చిన్నప్పటి నుంచి గజల్ దగ్గర పని చేస్తున్నట్టు చెప్పుకుంటున్న పార్వతి అనే రేడియో జాకీ శ్రీనివాస్ తప్పు ఏమీ లేదన్నట్టు పార్వతి వివరించారు. శ్రీనివాస్ మీద ఫిర్యాదు చేసిన మహిళ పేరు అందరూ అనుకున్నట్టు కుమారి కాదని అరుణ అని పార్వతి చెప్పారు. గజల్ శ్రీనివాస్ కి భుజం నొప్పి వచ్చినప్పుడు ఆమె చొరవ తీసుకుని మసాజ్ చేయడం తాను దగ్గరుండి చూసినట్టు పార్వతి తెలిపారు. నాలుగు నెలల నుంచే రేడియో ఆఫీస్ లో పని చేస్తున్న అరుణ ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండేదని పార్వతి చెప్పారు. ఇక ఎప్పటినుంచో తెలిసిన గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించడం చూడలేదన్నారు.