ఆ కుటుంబంకు షారుఖ్‌ రుణపడి ఉన్నాడట!

Shah Rukh Khan Dedicates His Success To Salman Khan Father

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తాజాగా సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న దస్‌ కా దమ్‌ షో ఫైనల్‌లో భాగంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. సల్మాన్‌ ఖాన్‌ పిలుపు మేరకు తాను ఈ షోకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చిన షారుఖ్‌ ఖాన్‌ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కనీసం తినేందుకు తిండి కూడా లేక ఇబ్బంది పడే వాడిని. ఆ సమయంలో నన్ను సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ ఆదుకున్నారు. నేను వేశాల కోసం స్టూడియోల చుట్టు తిరుగుతున్న సమయంలో నాకు భోజనం పెట్టించిన వ్యక్తి ఆయన అంటూ సలీం ఖాన్‌ గురించి షారుఖ్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

Salman-Khan-and-Shah-Rukh-K

తనకు సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పించడంతో పాటు, తన కెరీర్‌ ఎదుగుదలతో సలీం ఖాన్‌ పాత్ర చాలా ఉందని షారుఖ్‌ చెప్పుకొచ్చాడు. సల్మాన్‌ ఖాన్‌పై కూడా తనకు చాలా అభిమానం ఉందని, అందుకే ఈ షోకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడికే కాదు ఎక్కడికి అంటే అక్కడకు తాను వస్తాను అంటూ షారుఖ్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటా పోటీగా వీరిద్దరు ఢీ కొడుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో షారుఖ్‌ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో కొన్ని సార్లు సల్మాన్‌ ఖాన్‌ మరియు షారుఖ్‌ ఖాన్‌ల మద్య విభేదాలు ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కాని అవన్ని ఒట్టి పుకార్లే అంటూ ఆ తర్వాత తేలిపోయింది. కెరీర్‌ ఆరంభంలో చిన్న సాయం చేసినందుకు ఇప్పటికి కూడా షారుఖ్‌ ఖాన్‌, సలీం ఖాన్‌ను గుర్తు పెట్టుకోవడం అభినందనీయం అంటూ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Salman Khan and Shah Rukh Khan