‘అర్జున్‌ రెడ్డి’ని అక్కడ మార్చేశారు…!

Shahid-Kapoor-To-Star-In-Hi

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ద్వారా విజయ్‌ యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగులో మంచి విజయాన్ని దక్కించుకన్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళం, హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. తమిళంలో తెరకెక్కే ‘అర్జున్‌ రెడ్డి’కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు ఇప్పటికే విడుదయ్యాయి. తమిళంలో ‘వర్మ’గా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

kirira-advani

‘అర్జున్‌ రెడ్డి’ని తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు సందీప్‌ వంగ హిందీలో కూడా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటించనున్నాడు. అందుకోసం గతకొంత కాలంగా ‘అర్జున్‌ రెడ్డి’ పాత్రకు సూట్‌ అయ్యే విధంగా జుట్టు, బాడీని రెడీ చేస్తున్నట్టు బాలీవుడ్‌ వర్గాల నుండి సమాచారం. ‘అర్జున్‌ రెడ్డి’ని అక్కడ ఆకట్టుకునే విధంగా ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.లీ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ముంబైలో జరుగుతుండగా త్వరలోనే ఢల్లీిలో షూటింగ్‌ జరపనున్నారని సమాచారం అందుతోంది. తెలుగులో కంటే హిందీలో ఈ చిత్రంలో అధికంగా ముద్దు సీన్లను ఉండే విధంగా చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ముద్దులు చాలా కామన్‌ కాబట్టి అక్కడ యూత్‌ని ఆకట్టుకునే విధంగా ముద్దు సీన్లను ఎక్కువ చేస్తున్నారని చిత్ర యూనిట్‌ నుండి సమాచారం.

arjunreddy-movie