షకలక శంకర్‌ పరిస్థితి ఏంటీ?

Shambo Shankara movie public Talk

జబర్దస్త్‌ కమెడియన్‌ షకలక శంకర్‌ హీరోగా మారి చేసిన ప్రయత్నం ‘శంభో శంకర’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. నిన్న పలు చిత్రాలు విడుదల అవ్వగా సందట్లో సడేమియా అన్నట్లుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిరష్కరించారు. కమెడియన్‌గా మెప్పించిన షకలక శంకర్‌ హీరోగా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడు. ఏమాత్రం కథ, కథనంలో కొత్తదనం లేకుండా దర్శకుడు సినిమాను తీసి శంకర్‌ క్రేజ్‌ను పాతాలానికి తొక్కేశాడు. హీరోగా ప్రయత్నించిన శంకర్‌కు ఇప్పుడు కమెడియన్‌గా కూడా అవకాశాలు వస్తాయో లేదో చెప్పలేం.

జబర్దస్త్‌తో స్టార్‌ గుర్తింపును దక్కించుకున్న ధన్‌రాజ్‌ పరిస్థితి ఏంటో మన అందరికి తెల్సిందే. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో హీరోగా ప్రయత్నించాడు. రెండు మూడు చిత్రాలతో ఈయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఆమూడు సినిమాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో ఈయన సినిమాల ఛాన్స్‌ల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కమెడియన్స్‌ హీరోలుగా సక్సెస్‌ కాకుంటే దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనేది గతంలో మనం పలు సందర్బాల్లో చూశాం. ఇప్పుడు అదే విధంగా షకలక శంకర్‌ దారుణమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ వర్గాల వారు కూడా భావిస్తున్నారు. హీరోగా చేస్తూనే కమెడియన్‌గా చేస్తాను అంటూ షంకర్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు హీరో సంగతి పక్కన పెడితే కమెడియన్‌గా అయినా ఛాన్స్‌ వస్తుందా అనేది అనుమానంగా ఉంది.