రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో సాగే క‌థ

రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో సాగే క‌థ

ఈసారి బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌ వేస‌వి హీట్ ఎక్కువ‌గానే క‌నిపించ‌బోతోంది. ఎందుకంటే దాదాపు 15 – 20 సినిమాలు ఈ సీజ‌న్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఈ జాబితాలో శ‌ర్వానంద్ సినిమా కూడా చేరింది. శ‌ర్వా న‌టిస్తున్న కొత్త చిత్రం ‘శ్రీ‌కారం’. ప్రియాంకా మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కిషోర్ ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ లుక్ ఈరోజే విడుద‌ల చేశారు. కేశ‌వులు కొడుకుగా, ఓ రైతుగా ఇందులో శ‌ర్వా క‌నిపించ‌బోతున్నాడు. రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. రైతు విలువ‌, త‌న గొప్ప‌ద‌నం చాటుతూ శ‌ర్వా పాత్ర ఉండ‌బోతోంది. వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. శ‌ర్వా న‌టించిన ‘జానూ’ ఈ నెల‌లోనే విడుద‌ల కానుంది. స‌మంత న‌టించిన ఈ చిత్రం త‌మిళ ’96’కి రీమేక్‌. ఈ రెండు సినిమాల‌పైనా శ‌ర్వా చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. వ‌రుస ఫ్లాపుల త‌ర‌వాత వ‌స్తున్న ఈ రెండు సినిమాలూ శ‌ర్వా కెరీర్‌ని నిర్ణ‌యించ‌బోతున్నాయి.