అమరావతికి టాలీవుడ్‌ను తీసుకు వెళ్తారట…!

Shift Film Industry From Hyderabad To Amaravati

ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమను వైజాగ్‌కు తరలించేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. కాని హైదరాబాద్‌లో పూర్తిగా సెటిల్‌ అయిన తెలుగు సినిమా ప్రముఖులు వైజాగ్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. వైజాగ్‌ హైదరాబాద్‌ల మద్య దూరం కూడా చాలా ఎక్కువ అవ్వడం వల్ల హైదరాబాద్‌లోనే ఉండటం ఉత్తమం అని భావిస్తున్నారు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉండటం ఖాయం అని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే తెలుగు దేశం ప్రభుత్వం సినిమా పరిశ్రమ కోసం అమరావతిలో భారీ ఎత్తున భూ కేటాయింపుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. వైజాగ్‌, నెల్లూరు అంటే ఆసక్తి చూపించని సినీ జనాలు ఇప్పటికి అయినా ఓకే చెప్పాలని మురళి మోహన్‌ కోరుతున్నారు.

Hyderabad-To-Amaravati

వైజాగ్‌లో సినిమా పరిశ్రమ ఏర్పాటు అయితే హైదరాబాద్‌ కు కూడా చాలా చేరువగా ఉంటుందని, రోడ్డు ప్రయాణం ద్వారా నాలుగు గంటలు, ఎయిర్‌ ప్రయాణం ద్వారా గంట, రైలు ప్రయాణం అయితే ఆరు గంటలు మాత్రమే ఈ రెండు నగరాల మద్య సమయం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అమరావతిలో స్టూడియోల నిర్మాణంకు ముందుకు రావాలని, అలా వచ్చిన వారికి పెద్ద ఎత్తున రాయితీతో భూములు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఒక ఫిల్మ్‌ సిటీ నిర్మాణంకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తక్కువ రేటుకు అక్కడ సినిమా నిర్మాణం చేసుకునే విధంగా వీలు కల్పించబోతున్నారు. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి తీసుకు వెళ్లే వరకు చంద్రబాబు నాయుడు నిద్ర పోయేలా లేడు అంటున్నారు.

film-industry