శివాజీకి రహస్య పని | రవితేజను ఓడించిన అమర్ దీప్.. ప్రోమో అదిరిపోయింది..

ఇంటిసభ్యులకు ఫుడ్ ట్రీట్ ఇచ్చాడు బిగ్‏బాస్. అదే సమయంలో హౌస్‏లో మిస్ బిగ్‏బాస్ హత్య జరిగింది. నిన్నటి ఎపిసోడ్‏లో బిగ్‏బాస్ ఇచ్చిన పార్టీలో ఫుల్‎గా లాగించేశారు హౌస్మేట్స్. ఇక లివింగ్ ఏరియాలోనే కూర్చున్న అమర్ దీప్, అర్జున్.. ఏదో టాస్క్ రాబోతుందని ఊహించారు . ఇక అనుకున్నట్లు వాళ్లిద్దరిని పోలీసులుగా మార్చేసి ఇంట్లో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి రంగంలోకి దింపారు బిగ్‏బాస్. ఈరోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో విక్రమార్కుడు రవితేజను దించేశాడు అమర్ దీప్. మాస్ మాహారాజా నడక.. స్టైల్.. యాటిట్యూడ్.. కామెడీ టైమింగ్ బాగా అదరగొట్టేశాడు. ఇక కామెడీ టైమింగ్ పంచులతో శివాజీ రెచ్చిపోయాడు. ఇక యావర్, శోభా, రతిక, గౌతమ్ తమ పాత్రలలో జీవించేశారు.

శివాజీకి రహస్య పని | రవితేజను ఓడించిన అమర్ దీప్.. ప్రోమో అదిరిపోయింది..
Bigg Boss

ప్రోమోలో.. ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్.. కానిస్టేబుల్ కాంజిత్ అని అర్జున్ చెప్పగా.. కానిస్టేబుల్ కాదు.. మీతో పాటు నన్ను కూడా ఎస్ఐ అనే చెప్పారక్కడ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు అమర్ దీప్. ఇక శోభా, అశ్విని లేడీ రిపోర్టర్స్.. వీళ్లు బ్రేకింగ్స్ కోసం ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. రతిక బిగ్‏బాస్ వైఫ్ డ్రైవర్.. గౌతమ్ వంట చేసేవాడు. ఇక యావర్, ప్రియాంక బిగ్‏బాస్ వైఫ్ పనోళ్లుగా కనిపించారు. నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే నీకు ఇలా కన్ను కొడతా.. నువ్వు పక్కకు వచ్చెయ్ అని రతిక గౌతమ్ తో చెప్పడంతో ఏంటీ మళ్లీ కొట్టు అని అడిగాడు. దీంతో రతిక కన్ను కొట్టడంతో ఏయ్ మంచిగ కొట్టినవ్ లే అని అంటూ రతికను గిల్లడం.. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఇక బిగ్‏బాస్ భార్యకు గుమాస్తాగా శివాజీ కనిపించాడు.

మీరు కూడా ప్రోమో నో ఒక లుక్ వేయండి :

Video : https://youtu.be/NLKap2yqUu0