కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

shock to congress party in karnataka

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బల్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ బీ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్‌కు ఆనంద్ సింగ్ కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆనంద్ సింగ్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తారని మొదటి నుంచి వార్తలు వినిపించాయి. కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది. అయినప్పటికీ ఆనంద్ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరునిలోని ఈగిల్టన్ రిసార్ట్‌లో ఆనంద్ సింగ్‌పై మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ దాడి చేసిన సంగతి తెలిసిందే.