పెళ్లి పీఠలెక్కబోతున్న పుష్కర హీరోయిన్‌

shriya get married her russian boyfriend

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో పుష్కర కాలంగా హీరోయిన్‌గా నటిస్తూ ఇప్పటికి కూడా సీనియర్‌ హీరోలకు జోడీగా నటిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ శరన్‌. గత సంవత్సరం బాలకృష్ణ సరసన రెండు చిత్రాల్లో నటించిన శ్రియ ఈ సంవత్సరం ఆరంభంలోనే మోహన్‌బాబు ‘గాయత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరోయిన్స్‌ కొంత కాలం వరకు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటారు. కాని శ్రియ మాత్రం కంటిన్యూగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూనే ఉంది. దశాబ్దకాలం పాటు హీరోయిన్‌గా ఈమద్య కాలంలో కొనసాగిన వారు కనిపించడం చాలా అరుదు. అలాంటి నేపథ్యంలో శ్రియ ఏకంగా పుష్కర కాలంగా హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. అందుకే శ్రియ పుష్కర హీరోయిన్‌ అయ్యింది. సినిమాల్లో గత కొంత కాలంగా కాస్త అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడు వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం గత కొన్ని నెలలుగా శ్రియ ఒక రష్యన్‌ యువకుడితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతడితో వివాహానికి సిద్దం అయ్యిందని, ఇరు కుటుంబాల వారు ఓకే చెప్పడంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లో వేసవిలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత శ్రియ నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రియ పెళ్లి తర్వాత కూడా ఆమె వయస్సుకు తగ్గ పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి శ్రియ అభిమానుల కోరిక మేరకు సినిమాలు కంటిన్యూ చేస్తుందా లేదా పెళ్లి చేసుకుని రష్యాకు చెక్కేసి టాలీవుడ్‌తో పాటు సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందా అనేది చూడాలి.