రతికతో పర్సనల్‌ ఫొటోల లీక్‌పై సింగర్‌ రాహుల్ ఫైర్‌..

రతికతో పర్సనల్‌ ఫొటోల లీక్‌పై సింగర్‌ రాహుల్ ఫైర్‌..
Latest News

ప్రస్తుతం హౌజ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టాప్‌ కంటెస్టెంట్‌ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రతికా రోజ్‌. బిగ్ బాస్ 7 తెలుగులోకి పదో కంటెస్టెంట్‍గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోకు కావాల్సిన కంటెంట్‌ను బాగానే అందిస్తున్నది . మొదట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా వ్యవహరించింది. అయితే నామినేషనలో మాత్రం అతడిని గట్టిగా దెబ్బేసింది. ఆ తర్వాత ప్రిన్స్‌ యావర్‌తో కలిసిపోయింది. అతనికి సపోర్టుగా మాట్లాడింది.

రతికతో పర్సనల్‌ ఫొటోల లీక్‌పై సింగర్‌ రాహుల్ ఫైర్‌..
Rahul Sipliganj, Rathika Rsoe

ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లీగంజ్  ఫైర్‌ అయ్యారు. ఎప్పుడో గతంలో దిగిన కొన్ని పర్సనల్‌ ఫొటోలు సడెన్‌గా ఇంటర్‌నెట్‌లో లీక్‌ కావడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో అతను షేర్‌ చేసిన పోస్ట్‌ ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది . మరి రాహుల్‌ ఫైర్‌ అవ్వడానికి కారణమేంటి? అసలు ఆ ఫొటోల సంగతేంటి అనే వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ పోటాపోటీగా నడుస్తుంది. ఇప్పటికే మూడో వారంలోకి ప్రవేశించిందీ రియాలిటీ షో. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో అడుగపెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయిపోయారు .

ఆ వెంటనే మళ్లీ పవర్‌ అస్త్ర కంటెండర్‌కు ప్రిన్స్‌ అనర్హుడంటూ షాక్‌ ఇచ్చేసింది . పాపం పెద్ద మనసుతో రతికను క్షమించాడు ప్రిన్స్‌ . దీంతో మళ్లీ అతనితో ఒకే ప్లేటులో తింటూ హౌజ్‌లో రొమాన్స్‌ నడిపిస్తోందీ అందాల తార. మొత్తానికి హౌస్‌లో లవ్‌ ట్రాకులు నడుపుతూ, టాస్క్‌లు, గేమ్స్‌లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తోంది రతిక.