ప్రిన్సెస్ డ‌యానా వెడ్డింగ్ కేక్ కు వేలం?

Princess Diana's wedding cake up for auction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రిన్సెస్ డ‌యానా. చ‌నిపోయి 20 ఏళ్ల‌యినప్ప‌టికీ.. ఆమె జ్ఞాప‌కాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. త‌న అందం, స‌హృద‌యం, సేవాత‌త్ప‌ర‌త‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అందుకే ఆమెకు సంబంధించిన ప్ర‌తి అంశం ఇప్ప‌టికీ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ఈ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె వ‌స్తువులు కొన్నింటిని వేలంలో ఉంచాల‌ని అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ఆక్ష‌న్స్ కంపెనీ ఆర్ ఆర్ ఆక్ష‌న్స్ నిర్ణ‌యించింది.

Slice-of-Princess-Diana's-w

డ‌యానా వెడ్డింగ్ కేక్, పెళ్లీ వేడుక‌లో ఉప‌యోగించిన చాలా వ‌స్తువులు, లేఖ‌లు, ఫొటోలుతో పాటు ఆమె ఉప‌యోగించిన ర‌త్నాలు పొదిగిన బ్యాగ్ కూడా వేలం వేస్తున్నారు. 1981 జులై 29న ప్రిన్సెస్ డ‌యానా, ప్రిన్స్ చార్లెస్ పెళ్లి జ‌రిగింది. వెడ్డింగ్ కేక్ లో ఒక ముక్క‌ను బ‌కింగ్ హామ్ ప్యాలెస్ చిరునామాతో ఉన్న కేకు బాక్సులో ఉంచారు. దీంతో పాటు వేల్స్ రాజ‌వంశీయులు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇచ్చిన కార్డు కూడా ఉంది.

Diana's-wedding-cake

కేక్ తోపాటు కార్డును కూడా వేలంలో ఉంచ‌నున్నారు. 36 ఏళ్ల కింద‌టి ఈ కేక్ ముక్క వేలంలో దాదాపు 800 డాల‌ర్ల వ‌ర‌కు అమ్ముడ‌వుతుంద‌ని ఆర్ ఆర్ ఆక్ష‌న్స్ అంచ‌నావేస్తోంది. రాయ‌ల్ నావ‌ల్ కుకింగ్ స్కూల్ కు చెందిన డేవిడ్ ఏవ‌రీ ఈ కేకును త‌యారుచేశారు. డ‌యానాకు చెందిన అనేక వ‌స్తువులు వేలంలో ఉంచిన‌ప్ప‌టికీ.ఆమె బ్యాగ్ అన్నిటిక‌న్నా ఎక్కువ‌గా ధ‌ర ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు. మొత్తానికి డ‌యానా చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వివాహానికి బ‌కింగ్ హామ్ ప్యాలెస్ ఏర్పాట్లుచేసుకుంటున్న వేళ త‌ల్లి వెడ్డింగ్ కేక్ ను వేలంలో పెట్ట‌డం విశేషం.

wedding cake