కర్నాటక ఎలక్షన్స్ : రంగంలోకి సోనియా ! ఒక్కసారిగా మారిన పరిణామాలు

Sonia Gandhi offers CM chair to HD Kumaraswamy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఉదయం నుండి బీజేపీ గెలుస్తుందనే విధంగా ఉంటె ఇప్పుడు కొంత పరిస్థితి మారి ఇప్పుడు కర్నాటక ఫలితాలు హంగ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉదయం నుండి క్లియర్ మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆధిక్యత ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 8 సీట్ల వెనుకబడి ఉంది ! ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

కాంగ్రెస్ నుండి ట్రబుల్ షూటర్స్ గా పేరొందిన గులాం నబీ ఆజాద్. అశోక్ గెహ్లాట్ పొద్దున్న నుండి బెంగుళూరులో తిష్ట వేసి జేడీఎస్ తో మంతానాలు సాగిస్తుండగా ఇప్పుడు రంగంలోకి సోనియా దిగినట్టు తెలుస్తోంది ! ఈ తరుణంలోనే బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎత్తి పరిస్టితుల్లోను బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేని కాంగ్రెస్ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు ఒక ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. ఇదే జరిగితే కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.