తనకి తానే గాయం చేసుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్‌

తనకి తానే గాయం చేసుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్‌

టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ మార్కరమ్‌ గాయం వల్ల ఆడలేకపోయాడు. వరుస ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌ కావడంతో మార్కరమ్‌ నిరాశకు గురై రాంచీలో జరగనున్న చివరి మూడో టెస్టు లో ఆడకుండా తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌ మార్కరమ్‌ కుడిచేయి మణికట్టుకు గాయం కావడంతో చివరి మూడో టెస్టులో ఆడడం లేదని స్పష్టం చేయగా ఇక మార్కరమ్‌ దక్షిణాఫ్రికా కి తిరిగి వెళ్ళాడు.

తొలి టెస్టులో  టీమిండియా 203 పరుగుల తేడాతో విశాఖలో సఫారీలపై విజయం సాధించింది.రెండో టెస్టులో పుణేలో జరిగి ఉండగా 137 పరుగుల ఆధిక్యం తో టీమిండియా గెలిసింది.

సిరీస్‌మధ్యలో స్వదేశానికి వెళ్లాల్సి వస్తుందని ఊహించ లేదు, గాయం కావడం కంటే కూడా దక్షిణాఫ్రికా జట్టుకు దూరం కావడం ఎక్కువగా బాధ ఉందని మార్కరమ్‌ తెలిపారు. డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో నిరాశలో నా చేతికి నేనే గాయం చేసుకున్నా అని మార్కరమ్‌ చెప్పాడు.