మార్చి 2 నుండి సినిమాలు బంద్

South Cinema Theaters Bandh from March 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మార్చి 2 నుండి సినిమాలు బంద్, స్టూడెంట్స్ బంద్ చేస్తారు, పొలిటికల్ పార్టీలు బంద్ చేస్తారు కానీ సినిమా వాళ్ళు కూడా బంద్ చేస్తారా అని డౌట్ వచ్చిందా, తప్పుగా చదివాము అని అనుకుంటున్నారా కాదు అండి బాబు మీరు చదివింది, చూసింది అక్షరాల కరక్టే. క్యూబ్, యూఎఫ్ఒ ప్రతినిధులతో దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతల జేఎసి చర్చలు విఫలమయ్యాయి. దిని కారణంగా మార్చి 2 నుంచి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేతకు నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు. నిన్న బెంగళూరు ఫిలిం ఛాంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతలు, పంపిణీదారుల ఐకాస శుక్రవారం సమావేశమైంది. సినిమాల ప్రదర్శనకు క్యూబ్‌, యూఎఫ్‌వో అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే అంశంపై ఈ భేటీలో చర్చించారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు వసూలు చేస్తున్న ధరలు తగ్గించాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. వారి నిర్ణయాన్ని క్యూబ్‌, యూఎఫ్‌వో ప్రతినిధులు అంగీకరించలేదు. దానితో మార్చి 2 నుంచి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు.

అసలు గొడవ ఏంటి..

ఇంతకుముందు సినిమాను రీళ్ల ప్రింట్‌ల ద్వారా ప్రదర్శించే వారు. బాక్సులని ఒక థియేటర్‌ నుంచి మరొక థియేటర్‌కి పంపే వారు. ఈ రీళ్ల ప్రింట్‌లు నుండి సినిమా ప్రదర్శన డిజిటల్‌గా మారడం చిత్ర పరిశ్రమంలో ఓ విప్లవాత్మక మార్పు. శాటిలైట్‌ తో సినిమా అనేది డిస్ట్రిబ్యూషన్‌ రంగ రూపు రేఖల్ని మార్చేసింది. ఒకప్పుడు ఒక రీల్‌ సినిమా ప్రింట్‌ చేయడానికి రూ.60-70వేల వరకూ ఖర్చూ అయ్యేది. డిజిటల్‌ సినిమాకు ఖర్చూ తక్కువ అవుతుండటంతో అందరూ అటువైపే మొగ్గు చూపారు. అదే సమయంలో యూఎఫ్‌వో, పిఎక్స్‌డీ, క్యూబ్‌ వంటి ‘డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు’ సినిమాను అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని . అయితే డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు మీరు పైసా ఖర్చు పెట్టకుండా ‘మీ థియేటర్‌ ఇస్తే చాలు అన్నీ మేమే మార్చేస్తాం’ అని చెప్పడంతో కు చాలామంది థియేటర్‌లను ఇచ్చేశారు. అంత ఖర్చు పెట్టి థియేటర్లను డిజిటలైజ్‌ చేయడం వల్ల సర్వీస్‌ ప్రొవైడర్లకు లాభం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే సర్వీస్ ప్రొవైడర్లు చిన్న తిరకాసు పెట్టాయి. డిజిటల్‌కు మార్చినందుకు వాళ్ళకు ఐదేళ్ల పాటు థియేటర్‌ను ఇస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత సర్వీసు ఛార్జి తప్ప వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌ (వీపీఎఫ్‌) వసూలు చేయమని చెప్పాయి.

అప్పుడలా చెప్పిన డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఇప్పుడు ఇష్టానుసారంగా వీపీఎఫ్‌, ఇతర ఛార్జీలను వసూలు చేస్తున్నారు అని తెలుగు చిత్ర పరిశ్రమ ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ రంగంలోకి దిగి వారితో చర్చించింది. నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షతన 45మంది సభ్యులతో ఏర్పాటైన జాయింట్ ‌యాక్షన్‌ కమిటీ శుక్రవారం బెంగళూరులో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు డిమాండ్లను సర్వీస్‌ ప్రొవైడర్ల ముందుంచారు.

1. వెంటనే వీపీఎఫ్‌ తగ్గించాలి. లేదా రద్దు చేయాలి.
2. సినిమా ప్రారంభం, మధ్యలో వేస్తున్న యాడ్స్ ఎనిమిది నిమిషాలకు పరిమితం చేయాలి.
3. రెండు కొత్త సినిమాల ట్రైలర్లను ప్రతి సినిమాతో ఉచితంగా ప్రదర్శించాలి.

ఈ డిమాండ్లకు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో మార్చి 2వ తేదీ నుంచి థియేటర్లను బంద్‌ చేయాలని సినీ నిర్మాతల జేఎసి నిర్ణయించింది.

వీళ్ళ గొడవతో ప్రస్తుతం సమ్మర్ లో రిలీజ్ కావలసిన చాల సినిమాలు డౌట్ లో పడ్డాయి. మిగిలిన సినిమాలా మీద ఈ బంద్ ప్రభావం పడకుండా చూస్తాం అని ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాం అని నిర్మాతల మండలి చెబుతుంది.