అధికార పార్టీ ఎంత పిలిచినా పలికే దిక్కు లేదు.

South states political leaders not interest to joining in BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కేంద్రంలో పేరుకే సంకీర్ణ ప్రభుత్వం. పెత్తనమంతా బీజేపీ దే. సారీ… పెత్తనమంతా ప్రధాని మోడిదే. ఆయన అధికారాన్ని వాడుకుంటున్న తీరు చూసి సుదీర్ఘ కాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కూడా నోటి మీద వేలేసుకుంటోంది. విపక్షమే కాదు, మిత్రపక్షాలు, సొంత పార్టీలో వేరే గ్రూప్ మనుషులు… ఇలా ఒక్కోరితో మోడీ, అమిత్ షా డీల్ చేస్తున్న తీరు చూసాక పవర్ ని ఎలా ఉపయోగించాలో మిగిలిన రాజకీయ పక్షాలు కూడా నేర్చుకుంటున్నాయి. ఆ రకంగా కనుసన్నలతో రాజకీయాల్ని శాసిస్తున్న మోడీ అండ్ కో అక్కడికి వచ్చేసరికి అట్టర్ ప్లాప్ అవుతోంది. మోడీ ప్రభంజనం కొనసాగుతోందని తెలిసి కూడా కొత్తగా ఆ పార్టీలో చేరుతున్న నాయకులు ఎవరూ చేరడం లేదు. ఎన్నికల వాతావరణం మొదలైన గుజరాత్ మొదలుకుని ఎలాగైనా పాగా వేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ లోకి వలసలు కనిపించడం లేదు.

దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరీ ఘోరం. తమిళనాట రజని మొదలుకుని కమల్ దాకా, అన్నాడీఎంకే నేతలు మొదలుకుని పీఎంకే దాకా ఎంతో మందికి బీజేపీ ఆహ్వానాలు పలికింది. రాజకీయ ఆఫర్స్ ఇచ్చింది. అయినా చెప్పుకోదగ్గ ఒక్క నాయకుడు కూడా ఆ పార్టీ వైపు కెన్నెత్తి చూడలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరీ ఘోరం. చంద్రబాబు మీద వ్యతిరేకతతో ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చిన వాళ్ళు క్షేత్ర స్థాయి వాస్తవాలు చూసి లోలోన సిగ్గుపడుతున్నారు. విభజన పుణ్యమాని ఏపీ లో సమాధి అయిన కాంగ్రెస్ నుంచి కొందరు బీజేపీ లో చేరారు. తమ రాకతో పార్టీ బలపడుతుందని హైకమాండ్ దగ్గర గొప్పలు చెప్పుకుంన్నారు. తమ గొప్ప కోసం బాబుని తక్కువ చేసి మాట్లాడారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. కాంగ్రెస్ సహా ఏ పార్టీ నుంచి ఆ తర్వాత చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ బీజేపీ లో చేరలేదు. ఇంటికెళ్లి మరీ అడిగి కాదనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇంకోవైపు 2019 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార పార్టీ పిలిచినా పలికే దిక్కులేని ఈ పరిస్థితి చూస్తే తెలియడం లేదా రాబోయే రోజుల్లో ఆ పార్టీ భవితవ్యం ఏమిటో ?